తెలంగాణ

telangana

కేసీఆర్‌కు...మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదు: బండి సంజయ్‌

By

Published : Apr 2, 2023, 4:23 PM IST

Updated : Apr 2, 2023, 6:38 PM IST

Bandi Sanjay Fires on KCR: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన కేసీఆర్‌కు... మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదని విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి ఇంతవరకూ ఎందుకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు.

Bandi Sanjay
Bandi Sanjay

కేసీఆర్‌కు...మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదు: బండి సంజయ్‌

Bandi Sanjay Fires on KCR: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే.. కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని.. హస్తం పార్టీ పెద్దలే అంటున్నారని పేర్కొన్నారు. ఎవరు కలసినా బీజేపీదే తుది గెలుపని వ్యాఖ్యానించారు. ములుగులో నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ సభ్యుల సమ్మేళన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ తెలంగాణను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా.. సీఎం కేసీఆర్ అందుకు సహకరించట్లేదని బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో దోషులు తేలేవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పారు. లీకేజీకి బాధ్యుడైన మంత్రి కేటీఆర్​ను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై ముఖ్యమంత్రి ఇంతవరకూ ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఏ సర్వే చూసినా బీజేపీకి అనూకూలంగా ఉంది: ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన కేసీఆర్‌కు...మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా ఉందని తెలిపారు. గిరిజన వర్సిటీ పెడతామంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే.. వారి అభివృద్దికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే ఆలోచన ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు.. అందరికీ తెలియచేయాలని సూచించారు. రాష్ట్రంలో రామరాజ్యం తీసుకువచ్చేందుకు.. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్‌ సునీల్ బన్సల్‌, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ములుగు జిల్లాకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్‌ సునీల్ బన్సల్‌కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుని ఇరువరూ ప్రత్యేక పూజలు చేశారు. ములుగు పట్టణంలో శాంతిస్థూపం నుంచి లీలా గార్డెన్ వరకు కమల దళం నిర్వహించిన భారీ ర్యాలీలో వారు పాల్గొన్నారు.

"ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన కేసీఆర్‌కు...మోదీని తిట్టడం తప్ప వేరే పని లేదు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీకి అనుకూలంగా ఉంది. గిరిజన వర్సిటీ పెడతామంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు. గిరిజనుల మీద ప్రేమ ఉంటే.. వారి అభివృద్దికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పోడు భూముల సమస్యను పరిష్కరించే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు." -బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:రాజాసింగ్​పై మరో కేసు.. బెయిల్​ రద్దు చేయించేందుకే అంటూ ఎమ్మెల్యే మండిపాటు

జైలు శిక్షను సవాల్​ చేస్తూ సెషన్​ కోర్టు​కు రాహుల్.. సోమవారమే పిటిషన్!

Last Updated : Apr 2, 2023, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details