తెలంగాణ

telangana

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540 ఎకరాలపై సుప్రీం కీలక తీర్పు

By

Published : Sep 14, 2022, 7:10 PM IST

Updated : Sep 14, 2022, 7:25 PM IST

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540 ఎకరాలపై సుప్రీం కీలక తీర్పు

19:09 September 14

కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540 ఎకరాలపై సుప్రీం కీలక తీర్పు

హైదరాబాద్ నడిబొడ్డున కూక‌ట్‌పల్లి వై జంక్షన్ వద్దనున్న అత్యంత విలువైన 540.30 ఎక‌రాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉన్న ఉదాసిన్ మ‌ఠానివేనని సుప్రీంకోర్టు తేల్చింది. ఉదాసిన్ మ‌ఠం, గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ - ఐడీఎల్‌ కెమిక‌ల్స్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది. కూక‌ట్‌ప‌ల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మ‌ఠం భూముల‌ను 1964, 1966, 1969, 1978లో నాలుగు ద‌ఫాలుగా బ‌ఫ‌ర్ జోన్ ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు 99 ఏళ్ల కాల వ్యవధికి లీజు ఇచ్చింది. అయితే బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్న ఈ భూముల్లో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ 538 ఎక‌రాల విస్తీర్ణంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని సవాల్‌ చేస్తూ ఉదాసిన్ మ‌ఠం దేవాదాయ శాఖ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్రయించింది.

పిటిష‌న్ విచారించిన ట్రైబ్యున‌ల్.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు ఇచ్చిన లీజును 2011లో ర‌ద్దు చేసింది. ట్రైబ్యున‌ల్ తీర్పును స‌వాల్‌ చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. 2013లో డిస్మిస్ చేశారు. హైకోర్టు తీర్పును స‌వాల్‌ చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. యాధాతథస్థితి కొనసాగించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

బ‌హిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉంటుంద‌ని అంచనా. సుప్రీంకోర్టు తీర్పు ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. విలువైన భూముల‌ను కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన దేవాదాయశాఖ అధికారులు, శాఖ త‌ర‌ఫున వాదించిన న్యాయ‌వాదుల‌ను ఆయన అభినందించారు. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే చెందుతుందని సుప్రీంకోర్టు మ‌రోమారు స్పష్టం చేసినట్లైందని.. ఇదే స్ఫూర్తితో ఆక్రమణలో ఉన్న దేవాదాయ శాఖ భూముల‌ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు కృషి చేయాల‌ని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి..

Former MP Kothapalli Geeta Arrest : అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టు

కొత్త ట్విస్ట్.. నీతీశ్​తో పీకే భేటీ.. కొత్త కూటమి కోసమేనా?

Last Updated :Sep 14, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details