తెలంగాణ

telangana

RS Praveen Kumar: 'కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం వస్తోంది'

By

Published : Aug 28, 2021, 8:28 AM IST

Updated : Aug 28, 2021, 8:53 AM IST

RS Praveen Kumar
ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్​పై... బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కార్మికుల జీవితాలు దారుణంగా మారాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగా లేదని... అందుకే ప్రత్యామ్నాయం వస్తోందని తెలిపారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్​ పట్టణంలో తెలంగాణ కార్మికుల సమాఖ్య 14వ రాష్ట్ర మహాసభను ఐతే సాయన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాటి స్వర్ణాంధ్రే... నేటి బంగారు తెలంగాణగా నినాదం మారింది కానీ.. రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్

'బీఎస్పీ అనేది అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం. ఒకరికి బీఎస్పీ అమ్ముడుపోదు. అమ్మదు. తాకట్టు పెట్టదు. మడమ తిప్పదు, మాట తప్పదు. తరతరాలుగా ఈ పాలకులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా... ప్రజాబాహుళ్యాన్ని అక్షరాలతో చైతన్యం చేస్తాం. రాబోయే రోజుల్లో ఆ అక్షరాలనే ఇందనంగా, ఆయుధంగా వాడి... ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తాం. దేశంలోనే నిరక్షరాస్యత లేకుండా చూస్తాం.

-ఆర్​ఎస్ ప్రవీణ్ కుమార్

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొందరి బతుకులే బాగుపడ్డాయన్నారు. రాష్ట్రంలో కార్మికుల జీవితాలు దారుణంగా మారాయన్నారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీవన విధానం అత్యంత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు అనగానే పాలకులకు బడుగు, బలహీన వర్గాలు గుర్తొస్తాయని... మిగతా సమయాల్లో ఎవరూ పట్టించుకునే పాపాన పోరు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరు సరిగా లేదని... అందుకే ప్రత్యామ్నాయం వస్తోందని తెలిపారు.

ఇదీ చూడండి:CM KCR: 'నా చివరి రక్తపుబొట్టు దాకా శ్రమిస్తా'

Last Updated :Aug 28, 2021, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details