తెలంగాణ

telangana

మాజీమంత్రి మల్లారెడ్డి అతని అనుచరులపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 1:53 PM IST

Updated : Dec 13, 2023, 3:40 PM IST

Police Case on Ex Minister Mallareddy : మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని కబ్జా చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్​పేట్ పోలీసు స్టేషన్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Police Case on Ex Minister Mallareddy
Police Case Against EX Minister Mallareddy

Police Case on Ex Minister Mallareddy :మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్​పేట్ పోలీసు స్టేషన్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో భూమిని రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.

తెలంగాణ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌కుమార్‌ నామినేషన్

MLA Mallareddy Latest News : విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డిబంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా బాధితుడు కేతావత్ బిక్షపతి నాయక్ మాట్లాడుతూ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల18 గుంటల భూమి మా పెద్దల నుండి మాకు వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు. మా కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరు మీద మొత్తం భూమి ఉందని అన్నారు.

ఈ భూమిపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిఈ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తన అనుచరులతో కలిసి మాకు మాయ మాటలు చెప్పి నమ్మించి మా ఏడుగురితో 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని పేర్కొన్నారు. మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి ఎస్టీ లంబాడీలమైన మాపై అట్రాసిటీ పాల్పడినారని, మా ఏడుగురుకి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చి భూమి తీసుకున్నారని తెలిపారు.

'ప్రజల కోసం పనిజేసిన - నా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన - మళ్లీ గెలిపిస్తే ఇంకా చేస్తా'

Protest Against Mallareddy : మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం

Last Updated :Dec 13, 2023, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details