లోక్​సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 2:03 PM IST

thumbnail

Kotha Prabhakar Reddy Resigned As MP : లోక్​సభ సభ్యుడిగా బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను లోక్​సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు సమర్పించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీగా తాను ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి పనులు, 10 ఏళ్లు గా పార్లమెంట్​తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు గెలిచారు. 2014, 2019లో మెదక్​ ఎంపీగా గెలిచిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీ చేసి, ప్రత్యర్థి రఘునందన్​ రావుపై గెలుపొందారు.  ఎమ్మెల్యే, ఎంపీ రెండింటో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొనగా పార్లమెంటు సభ్యత్వానికి వదులుకున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.