తెలంగాణ

telangana

FINE TO HOSPITAL: ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా.. ఎందుకంటే?

By

Published : Jun 20, 2022, 7:28 PM IST

FINE TO SLG HOSPITAL
ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా ()

FINE TO HOSPITAL: హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రికి అధికారులు భారీ జరిమానా విధించారు. ఆస్తి ప‌న్ను స్వీయ మదింపులో త‌ప్పుడు వివ‌రాలు స‌మ‌ర్పించిన ఆస్పత్రి యాజమాన్యానికి నగరపాలక సంస్థ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు.

FINE TO HOSPITAL: ఆస్తి పన్ను మదింపులో తప్పుడు వివరాలు సమర్పించారని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భారీస్థాయిలో జరిమానా పడింది. హైదరాబాద్ బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆస్తిపన్ను స్వీయ మదింపులో తప్పుడు వివరాలు ఇచ్చినందుకు ఎస్‌ఎల్‌జీ ఆస్పత్రికి జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా

హైదరాబాద్ బాచుప‌ల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆస్ప‌త్రి 4 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. ఇందుకు గాను 2 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్‌తో సహా 9 అంత‌స్తుల‌కు అనుమ‌తి ఉంది. అయితే వాస్త‌వానికి 10 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు గ‌జాల్లో నిర్మాణ అంత‌స్తులు ఉండ‌గా.. కేవ‌లం 4 అంత‌స్తుల్లోనే 32,300 చ‌ద‌ర‌పు గ‌జాలుగా పేర్కొంటూ ఇటీవ‌ల అంత‌ర్జాలం ద్వారా ఆస్పత్రి యాజ‌మాన్యం స్వీయ మదింపుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన నిజాంపేట న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు స‌ద‌రు వివ‌రాలు త‌ప్పుగా ఉన్నాయ‌ని పేర్కొంటూ రూ. 24 కోట్ల‌కు పైగా జ‌రిమానా విధించారు. తెలంగాణ మున్సిప‌ల్ చ‌ట్టం ప్ర‌కారం.. ద‌ర‌ఖాస్తు దారుడు స్వీయ ఆస్తిప‌న్ను మ‌దింపులో ఇచ్చిన వివ‌రాలు త‌ప్పుగా ఉంటే స‌ద‌రు ఆస్తి విలువ‌కు 25 రెట్ల జ‌రిమానా విధిస్తారు. ఆ ప్ర‌కారం.. ఆ ఆసుప‌త్రికి రూ. 24 కోట్ల జ‌రిమానా విధించిన‌ట్లు నిజాంపేట నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.24 కోట్ల భారీ జరిమానా

ABOUT THE AUTHOR

...view details