తెలంగాణ

telangana

KISHAN REDDY: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ అమలుపై ఆరా

By

Published : Aug 21, 2021, 1:03 PM IST

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్రం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రగతినగర్​లోని రేషన్​ దుకాణాన్ని సందర్శించి ఉచిత బియ్యం పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు.

KISHAN REDDY
ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో కిషన్‌ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర మూడో రోజుకు చేరుకుంది. భువనగిరిలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి... ప్రగతి నగర్​లోని రేషన్​ దుకాణాన్ని సందర్శించారు.

ఉచిత బియ్యం పంపిణీని విధానాన్ని పరిశీలించారు. పంపిణీ అమలును గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. బియ్యంను పరిశీలించి... ఏవైనా సమస్యలుంటే చెప్పాలని... లబ్ధిదారులకు సూచించారు. అనంతరం అక్కడి నుంచి పయనమై ఘట్​కేసర్​కు చేరుకున్నారు. అప్పటికే భారీగా హాజరైన భాజపా శ్రేణులు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

ఇదీ చూడండి:KISHAN REDDY: 'జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభిస్తాం'

ABOUT THE AUTHOR

...view details