తెలంగాణ

telangana

'నర్సాపూర్​ పురపాలికను ఆదర్శంగా మార్చతాం'

By

Published : Nov 19, 2020, 9:08 PM IST

మెదక్​ జిల్లాలోని నర్సాపూర్​లో సాధారణ పురపాలిక సమావేశం జరిగింది. పురపాలికను జిల్లాలో ఆదర్శంగా మార్చుతామని ఛైర్మన్ మురళియాదవ్ అన్నారు.

A general municipal meeting was held at Narsapur in Medak district
నర్సాపూర్​ పురపాలికను ఆదర్శంగా మార్చతాం

నర్సాపూర్​ పురపాలికను మెదక్ జిల్లాలో ఆదర్శంగా మార్చుతామని ఛైర్మన్ మురళియాదవ్ అన్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో రూ. 25కోట్లతో ఏఏ పనులు చేపట్టాలని చర్చించారు.

ఇందులో పలు అంశలపై చర్చించిన తరువాత ఏకాభిప్రాయానికి వచ్చారు. మున్సిపల్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణాలు ముందుగా చేపడుతామని చెప్పారు. అనంతరం పురపాలిక కోసం మూడున్నర ఎకరాల స్థలం, వైకుంఠధామం కోసం ఎకరంన్నర స్థలం కేటాయించినట్లు చెప్పారు. దుకాణాల, ఇంటిపన్నులను పెంచడానికి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌, వైస్‌ఛైర్మన్‌ నయిమొద్దిన్‌, కౌన్సిలర్‌లు ఉన్నారు.

ఇదీ చదవండి :పేరుండి ఇక్కడ లేని వారి వివరాలు ఇవ్వాలి: రాష్ట్ర ఎన్నికల సంఘం

ABOUT THE AUTHOR

...view details