తెలంగాణ

telangana

చీటీలు పెట్టి దొరికిన విద్యార్థిపై పోలీసు కేసు

By

Published : Mar 6, 2020, 4:02 PM IST

పరీక్షల్లో విద్యార్థులు చూసి రాయటమో... చీటీలు పెట్టి దొరికినప్పుడు మందలించటమో... పేపర్​ లాక్కొని పంపించటమో... ఇంకాస్త కఠినంగా వ్యవరించి డిబార్ చేయటమో జరుగుతుంది. కానీ.. ఇక్కడ చీటీలు పెట్టిన ఓ విద్యార్థిపై ​ఏకంగా పోలీసు కేసు పెట్టారు అధికారులు.

POLICE REGISTERED CASE ON INTER SECOND YEAR STUDENT FOR COPYING IN EXAM
POLICE REGISTERED CASE ON INTER SECOND YEAR STUDENT FOR COPYING IN EXAM

చీటీలు పెట్టి దొరికిన విద్యార్థిపై పోలీసు కేసు

ఇంటర్మీడియట్‌ రెండో సంత్సరపు మొదట పరీక్షలో చీటీలు పెట్టిన విద్యార్థిపై పోలీసు కేసు నమోదైంది. మహబూబ్​నగర్​లోని ఎంబీసీ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి కాపీయింగ్​ చేస్తుండగా... చివరి నిమిషంలో ఇన్విజిలేటర్‌ పట్టుకున్నారు. విద్యార్థి దగ్గరున్న చీటీలను ఇన్విజిలేటర్​ లాక్కోగా.. ఆ విద్యార్థి ఉపాధ్యాయురాలితో వాగ్వాదం పెట్టుకున్నాడు.

ఇన్విజిలేటర్ దగ్గరున్న చీటీలను తీసుకునే క్రమంలో సమాధాన పత్రాలను సైతం విద్యార్థి లాగేసుకున్నాడు. సమాధాన పత్రంలోని చివరి పేజి చిరిగిపోయింది. విషయం తెలుసుకున్న జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి వెంకటేశ్వర్లు... జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావుతో పాటు ఇంటర్‌ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇన్విజిలేటర్‌తో దురుసుగా ప్రవర్తించిన విద్యార్థిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా... విద్యార్థిపై కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details