తెలంగాణ

telangana

Harishrao fires on congress : ప్రకృతి వైపరీత్యాల కంటే.. దారుణంగా మారిన ప్రతిపక్షాలు

By

Published : May 27, 2023, 5:36 PM IST

Harishrao mahabubnagar tour : ప్రకృతి వైపరిత్యాల కంటే దారుణంగా తెలంగాణలో ప్రతిపక్షాలు తయారయ్యాయని, ప్రతిపక్షాల వైఖరి వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 50చోట్ల అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Harishrao
Harishrao

TS health minister harishrao : తెలంగాణలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్‌ కాలేదని.. కాంగ్రెస్‌ పార్టీ ఫెయిల్‌ అయిందని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరించేలా తెలంగాణలో కేసీఆర్​ పాలన సాగుతుంటే.. ప్రతిపక్షాలు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిని మంత్రి శ్రీనివాస్​గౌడ్​తో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై హరీశ్​ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ సహా గత ప్రభుత్వాల పాలనలో.. పాలమూరు జిల్లాకు కరువు, వలసలు, ఆకలి చావులు తప్ప ఏమీ ఇవ్వలేదన్నారు. అలాంటి పాలన తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలాంటి పాలన ఎవరు కోరుకుంటారన్నారు.

palamuru rangareddy lift irrigation scheme : కేసీఆర్​ పాలనలో పాలమూరు జిల్లాలో వలసలు వాపస్ వస్తున్నాయని, బీడు భూములు సస్యశ్యామలమయ్యాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జులై - ఆగస్టు నెలల్లో పొల్లాల్లోకీ నీరు పారిస్తామని చెప్పారు. తెలంగాణలో తొలి వైద్యకళాశాల మహబూబ్​నగర్​లో నెలకొల్పామని, 2500 కోట్లతో ఉమ్మడి జిల్లాలో 5 వైద్యకళాశాలలు తెచ్చామని, పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క వైద్యకళాశాల ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 20 వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఉంటే, బీఆర్​ఎస్ హయాంలో 55కు పెంచామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రులు, వ్యవసాయ కళాశాల సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. బీఆర్​ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన ప్రతిఒక్కరి నుంచి ఓట్లు అడుగుతామని, ఇక ప్రతిపక్షాలకు ఓట్లు ఎవరు వేస్తారన్నారు.

ts sports minister srinivas goud : కాంగ్రెస్ తప్పుడు ప్రచారాల్ని ప్రజల్లో తిప్పికొట్టాలని, ప్రజలకు వాస్తవాలు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి సభలో ఏదో ఒక కులాన్ని దూషిస్తున్నారని, అహంకారంతో మాట్లాడుతున్నారని వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో బిల్లులు తప్ప ఇళ్లు లేవని విమర్శించారు. ప్రజల్ని రెచ్చగొట్టి విడదీసే ప్రయత్నం చేస్తారని గందరగోళానికి గురికావద్దని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వమే వస్తుందన్న ఆయన.. కేసీఆర్​ను ఢీకొట్టే నాయకుడు లేదని జోస్యం చెప్పారు.

"ప్రకృతి వైపరీత్యల కంటే ప్రమాదకరంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు తయారయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రజలు వలసబాట పట్టారు. అటువంటి పాలమూరు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. కాంగ్రెస్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా నిరుద్యోగం లేదు".- హరీశ్​రావు, వైద్యారోగ్యశాఖా మంత్రి

ప్రకృతి వైపరీత్యాల కంటే.. దారుణంగా మారిన ప్రతిపక్షాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details