తెలంగాణ

telangana

'యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

By

Published : Nov 4, 2019, 4:36 AM IST

మహబూబ్ నగర్​ జిల్లా కేంద్రంలో యాదవుల సాంప్రదాయ పండుగ సదర్ ఉత్సవాలను సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

జిల్లా స్థాయి సదర్ ద్వారా కులబాంధవులందరూ ఏకతాటిపైకి

యాదవుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సదర్‌ ఉత్సవాలను మంత్రి ప్రారంభించారు. యాదవులు నమ్మకానికి మారుపేరని తెలంగాణలో ఇలాంటి సాంప్రదాయ వేడుకలకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారని వివరించారు. యాదవ జాతిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాష్ట్ర రాజధానిలో నిర్వహించే సదర్... జిల్లా స్థాయిల్లోనూ నిర్వహించడం ద్వారా అందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అవకాశం కలిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రత్యేకంగా హైదరాబాద్​తో పాటు పంజాబ్‌, హరియాణా నుంచి తీసుకొచ్చిన మేలిమిజాతి దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

జిల్లా స్థాయి సదర్ ద్వారా కులబాంధవులందరూ ఏకతాటిపైకి
ఇవీ చూడండి : భక్తజన సందోహం... కురుమూర్తిలో వైభవంగా ఉద్దాల ఉత్సవం

ABOUT THE AUTHOR

...view details