తెలంగాణ

telangana

తమ్ముడు చనిపోయిన కొద్ది గంటల్లోనే అన్న మృతి

By

Published : Feb 12, 2020, 10:00 PM IST

తల్లి కడుపున పేగు తెంచుకు పుట్టిన అన్నాదమ్ములు మరణంలోనూ వారి పేగు బంధాన్ని వీడలేదు. తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందగా... కలత చెందిన అన్న కూడా మృతి చెందాడు. వీరిద్దరూ కడియం శ్రీహరికి దగ్గరి బంధువులు.

younger brother passed away just hours after he brother died in Mahabubabad district
తమ్ముడు చనిపోయిన కొద్ది గంటల్లోనే అన్న మృతి

తమ్ముడు చనిపోయిన కాసేపటికి అన్నయ్య మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. వీరిద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి దగ్గరి బంధువులు. గ్రామానికి చెందిన కడియం నారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం తెల్లవారుజామున మృతి చెందారు. తమ్ముని మృతితో కలత చెందిన అన్న రామలింగయ్య మధ్యాహ్నం సమయంలో మృతి చెందారు. గ్రామంలో ఒకేరోజు ఇద్దరు మృతి చెందటం వల్ల ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.

తమ్ముడు చనిపోయిన కొద్ది గంటల్లోనే అన్న మృతి

ABOUT THE AUTHOR

...view details