తెలంగాణ

telangana

పాఠశాల మూత్రశాలలో పాము కలకలం

By

Published : Dec 24, 2019, 7:05 PM IST

ఓ పాఠశాల మూత్రశాలలో పాము కలకలం సృష్టించిన ఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా... వెంటనే వారు అక్కడకు చేరుకుని పామును పట్టుకున్నారు.

snake in school toilet in mahabubabad district
పాఠశాల మూత్రశాలలో పాము కలకలం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మూత్రశాలలో పాము కలకలం సృష్టించింది. మూత్ర శాలకు వెళ్ళిన బాలిక పామును చూసి కేకలు వేయడం వల్ల ఉపాధ్యాయులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు పాఠశాలకు చేరుకుని ఆ పామును పట్టుకున్నారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పాము రక్త పింజర అని... ఇది చాలా ప్రమాదకరమని.... కాటు వేసిన వెంటనే మనిషి చనిపోతారని..పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. పాఠశాల ప్రహరి కూలిపోయి ఉన్నందున పాము లోపలికి వచ్చి ఉండవచ్చని వాచ్​మెన్ తెలిపారు.

పాఠశాల మూత్రశాలలో పాము కలకలం
sample description

ABOUT THE AUTHOR

...view details