ETV Bharat / state

మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు

author img

By

Published : Dec 24, 2019, 5:29 PM IST

ఆసియాలో అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం జాతరకు ఇప్పటినుంచే సందడి మొదలైంది. ఇప్పటి నుంచి భక్తుల రద్దీ పెరుగుతున్నా.. సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నదిలో నీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు
మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పిల్లాపాపలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ తీరు పట్ల భక్తుల్లో ఆసహనం వ్యక్తం అవుతోంది. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలు ఉన్నప్పటికీ స్నానాలు చేసేందుకు నల్లాలు లేవని భక్తులు వాపోతున్నారు.

బట్టలు మార్చుకునే గదులేవి..?

బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు నిర్మించకపోవడం పట్ల మహిళ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ... వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జంపన్న వాగు వంతెన సమీపంలో ఇరువైపులా నల్లాలు బిగించి బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.

మేడారం: సౌకర్యాల లేమితో భక్తులకు తప్పని ఇక్కట్లు

చేపట్టాల్సిన పనులెన్నో...

సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించగా.. నెల రోజుల క్రితమే పనులు ప్రారంభించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నా....అవి ఎక్కడా వేగం పుంజుకోవట్లేదు. జల్లు స్నానాల కోసం... జంపన్నవాగు వద్ద పైపుల నిర్మాణం చేయాల్సి ఉంది. ఇంతవరకు ఈ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

జాతరకు సమయం దగ్గరపడుతున్న ఈ సమయంలోనైనా అధికారులు.. పనులు త్వరగా పూర్తి చేయించాలి. లేకుంటే వచ్చే భక్తులకు తిప్పలు తప్పవు.

ఇవీ చూడండి: మేడారంలో పనులు మందగమనం

Intro:tg_wgl_51_23_jampanna_vaagu_vadda_leni_vasthulu_pkg_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్: మేడారం జాతర సమయం ఆసన్నమైంది సెలవు రోజులు ఉంటే చాలు మేడారం జాతరలో భక్తులు పోటెత్తుతున్నారు. పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు వద్ద ఇప్పటి వరకు సరైన వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


Body:వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు నిత్యం భక్తులు వస్తూనే ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు సెలవు రోజు ఉంటే చాలు పిల్లాపాపలతో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జాతరకు వస్తే పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుని ఆ వనదేవతల సన్నిధికి వెళ్తారు. జంపన్న వాగు వద్ద స్నానఘట్టాలు ఉన్నప్పటికీ స్నానాలు చేసేందుకు వాటర్ టాప్స్ లేవని మహిళా భక్తులకు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేవని మహిళ భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల అభివృద్ధి పనులు చే పడుతున్నప్పటికీ వచ్చే భక్తులకు సౌకర్యం కల్పించడం లో జాప్యం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. జంపన్న వాగు వంతెన సమీపంలో ఇరువైపులా నల్లాలు బిగించి బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.


Conclusion:బైట్స్ : 1, స్వప్న వరంగల్
2, నాగజ్యోతి వరంగల్
the end p to c G Raju contributor
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.