తెలంగాణ

telangana

విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు

By

Published : Jun 5, 2021, 10:26 PM IST

రైతులకు మేలు రకం విత్తనాలు అందించాలని తొర్రూర్​ డీఎస్పీ వెంకటరమణ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు
విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. విత్తనాల నిలువలు పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.

రైతులకు మేలు రకం విత్తనాలు అందించాలని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువుల విక్రయించాలన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలు జరిపితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:TS News: రాష్ట్రవ్యాప్తంగా ఆగిన రిజిస్ట్రేష‌న్లు

ABOUT THE AUTHOR

...view details