తెలంగాణ

telangana

HOLI CELEBRATIONS : అధికారుల స్టెప్పులతో అదిరిన హోలీ వేడుకలు

By

Published : Mar 18, 2022, 6:05 PM IST

HOLI CELEBRATIONS: ఎప్పుడు విధుల్లో బిజిగా ఉండే అధికారులు అంతా కలిసి హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ఇందుకు మహబూబాబాద్ జిల్లా వేదికైంది.

Collector at Holi celebrations
హోలీ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

HOLI CELEBRATIONS: ఎప్పుడు విధుల్లో బిజీ బిజీగా ఉండే అధికారులు అంతా ఒక చోట కలిసి హోలీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఇందుకు వేదికైంది.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక ,ఎస్పీ శరత్ చంద్ర పవార్, జగిత్యాల ఎస్పీ రక్షిత , విపత్తు నివారణ సంచాలకుడు విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని, రంగు నీళ్లు పోసుకొని డీజే పాటలకు నృత్యాలు చేశారు.

హోలీ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

ఇదీ చదవండి: ఎమ్మెల్యే హోలీ ధూంధాం.. కార్యకర్తలకు మందు.. విందు.. చిందు..

ABOUT THE AUTHOR

...view details