తెలంగాణ

telangana

అకాల వర్షం.. రైతన్నకు తీవ్ర నష్టం..

By

Published : Jun 2, 2021, 3:49 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతన్నకు భారీ నష్టం మిగిల్చింది. పలు మండలాల్లో కురిసిన వర్షం వల్ల.. కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యంతో పాటు రైతుల పొలాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Paddy grain tainted by rains in komuram bheem district
Paddy grain tainted by rains in komuram bheem district

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కాగజ్ నగర్, సిర్పూర్ టి, కౌటాల మండలాల్లో కురిసిన వర్షం వల్ల.. కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. తెల్లవారు జామున కురిసిన వానవల్ల తీవ్ర నష్టం వాటిల్లింది.

రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో నిల్వ చేసిన ధాన్యం వర్షం ధాటికి కొట్టుకుపోయింది. మూడు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వర్షం నీటితో నిండిపోయాయి. సరిపడా టార్పాలిన్లు లేకపోవడం వల్ల రైతులు నానా అవస్థలు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి. ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?

ABOUT THE AUTHOR

...view details