తెలంగాణ

telangana

'పెరిగిన ధరలతో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకం'

By

Published : Jun 11, 2021, 1:19 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేతలు కాగజ్​నగర్​లో​ నిరసన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో కేంద్రం ధరలు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో సామాన్యుల బతుకు ప్రశ్నార్థకమైందని వాపోయారు.

petrol rates, congress protest
పెట్రోల్ ధర, కాంగ్రెస్ ఆందోళన

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా.. కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతోందని ఆరోపించారు. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుని బతుకు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు.

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ వెంకటేశ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ దస్తగిర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

ABOUT THE AUTHOR

...view details