తెలంగాణ

telangana

శిథిలావస్థకు చేరిన కాకతీయ కాలువ

By

Published : May 15, 2019, 5:10 PM IST

శిథిలావస్థకు చేరిన కాకతీయ కాలువ ()

ఎస్సారెస్పీ కాకతీయ కాలువ లైనింగ్ కొట్టుకుపోయి శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో రేవల్లి నుంచి చొప్పదండి వరకూ నాలుగు కిలోమీటర్ల మేర అక్కడక్కడ సిమెంటు కొట్టుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది.

కరీంనగర్ జిల్లా రేవల్లిలో ఎస్సారెస్పీ కాలువ ఒకవైపు లైనింగ్ శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తే ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకు పోయి దిగువ ప్రాంతాలు జలమయంగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచే కాకతీయ కాలువ నేరుగా దిగువ మానేరు జలాశయంలోకి కలుస్తోంది. వర్షాకాలానికి ముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

శిథిలావస్థకు చేరిన కాకతీయ కాలువ

ఇవీ చూడండి: ఇంట్లో చెప్పుకోలేక.. బెట్టింగ్ డబ్బులు కట్టలేక...

Intro:ఎస్ ఆర్ ఎస్ పి కాకతీయ కాలువ లైనింగ్ కొట్టుకుపోయి శిథిలావస్థకు చేరుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవల్లి నుంచి చొప్పదండీ వరకూ గల నాలుగు కిలోమీటర్ల మేరకు అక్కడక్కడ సిమెంటు కొట్టుకుపోయి నీటి ప్రవాహానికి బుంగ పడే విధంగా తయారయింది. ఎస్సారెస్పీ కాల్వ 118 నుంచి 122వ కిలోమీటర్ వరకు ఒకవైపు లైనింగ్ శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఎస్సారెస్పీ నీరు విడుదల చేస్తే ప్రవాహ వేగానికి మట్టి కొట్టుకు పోయి దిగువ ప్రాంతాలు జలమయంగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడి నుంచే నేరుగా కాకతీయ కాలువ దిగువ మానేరు జలాశయంలోకి కలిపారు. ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు ముందస్తుగా స్పందించి వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేపడితే తెలంగాణలోని ప్రధానమైన కాకతీయ కాలువ సమయానికి ఉపయోగపడే అవకాశం ఉంది.


Body:సయ్యద్ రహమత్, చొప్పదండి


Conclusion:9441376632

ABOUT THE AUTHOR

...view details