తెలంగాణ

telangana

Huzurabad: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపా, తెరాస కార్యకర్తల ఘర్షణ

By

Published : Oct 22, 2021, 8:13 PM IST

Updated : Oct 22, 2021, 8:53 PM IST

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపా, తెరాస కార్యకర్తల ఘర్షణ
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపా, తెరాస కార్యకర్తల ఘర్షణ

20:13 October 22

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపా, తెరాస కార్యకర్తల ఘర్షణ

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భాజపా, తెరాస కార్యకర్తల ఘర్షణ

   కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం సందర్భంగా ర్యాలీ నిర్వహించగా.. తెరాస కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

  పరస్పరం ఇరుపార్టీల నాయకులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేయడంతో పాటు ఒకరిపై ఒకరు దూసుకుపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. అడ్డుకొనేందుకు యత్నించిన ఎస్సైపై ఒకరు చేయి చేసుకోవడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. దీనితో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పి పంపారు. ఈ ఘర్షణ పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భాజపా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. 

ఇదీ చదవండి:Huzurabad by election: ఆ ముగ్గురూ ఉద్యమం నుంచి పుట్టినవారే.. కాకపోతే..!

Last Updated :Oct 22, 2021, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details