తెలంగాణ

telangana

ప్రతిపాదించిన స్థలంలోనే రైతు వేదిక నిర్మించాలని అఖిలపక్ష నాయకుల ధర్నా

By

Published : Aug 30, 2020, 7:18 PM IST

కరీంనగర్​ జిల్లా కాచాపూర్​ గ్రామంలో రైతువేదిక కోసం ప్రతిపాదించిన స్థలంలోనే నిర్మాణం చేయాలని డిమాండ్​ చేస్తూ అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.

all party leaders protested in karimnagar district
ప్రతిపాదించిన స్థలంలోనే రైతు వేదిక నిర్మించాలని అఖిలపక్ష నాయకుల ధర్నా

ప్రతిపాదించిన స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ స్థలాలు మార్చడం అవివేకానికి నిదర్శనమని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కాచాపూర్​లో రైతు వేదిక కోసం ప్రతిపాదించిన స్థలాన్ని విడిచి ఆరోగ్య ఉప కేంద్రానికి కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టడం సమంజసం కాదని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఆరోగ్య ఉప కేంద్రానికి హాని తలపెట్టవద్దని కోరుతూ సీపీఐ కౌన్సిల్ సభ్యుడు బ్రాహ్మణపల్లి యుగంధర్ ఆధ్వర్యంలో శిలాఫలకం ఎదుట ధర్నా చేపట్టారు.

తమ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఇష్టారీతిన వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెజస మానకొండూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి కనకం కుమార స్వామి, బీసీ విద్యార్థి సంఘం ఉత్తర తెలంగాణ కో-ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆరిఫ్, వైఎస్సార్​సీపీ మండల అధ్యక్షుడు తాళ్లపెళ్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సర్కార్​ దవాఖానాలు: తలసాని

ABOUT THE AUTHOR

...view details