తెలంగాణ

telangana

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ

By

Published : Mar 4, 2020, 10:50 PM IST

Updated : Mar 4, 2020, 11:25 PM IST

పట్టాదారు పాసుపుస్తకంలో పేరు మార్పిడి కోసం లంచం డిమాండ్‌ చేసిన కామారెడ్డి జిల్లా లింగంపేట ఆర్‌ఐ ఏసీబీ వలకు చిక్కాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఆనిశా అధికారులు నిందితుడి నివాసంలోనూ సోదాలు చేపట్టారు.

revenue inspecter in acb trap when take bribe from farmer in kamareddy
లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఆర్ఐ

కామారెడ్డి జిల్లా లింగంపేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు మార్పిడి కోసం 4,500 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడు మహ్మద్ బషీరుద్దీన్‌ అనిశాను ఆశ్రయించాడు.

బుధవారం సాయంత్రం 3వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుభాష్‌ను పట్టుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని నిందితుడి నివాసంలో ఏసీబీ సీఐలు శంకర్‌ రెడ్డి, శివకుమార్‌ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఆర్ఐ
Last Updated :Mar 4, 2020, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details