తెలంగాణ

telangana

బతుకమ్మ అందరి పండగ : ఎమ్మెల్యే గంప గోవర్ధన్

By

Published : Oct 16, 2020, 10:09 AM IST

బతుకునిచ్చే బంగారు తల్లి బతుకమ్మ అని.. పేద, ధనిక తేడా లేకుండా నిర్వహించుకునే పూల సంబురం బతుకమ్మ పండగ అని ప్రభుత్వ చీఫ్ విప్, కామారెడ్డి  ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు పంచారు.

MLA Gampa Govardhan Distributes Bathukamma Sarees in Kamareddy
బతుకమ్మ చీరలు పంచిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్​ హాల్​లో ప్రభుత్వ చీఫ్ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మహిళలకు బతుకమ్మ చీరలు పంచారు. ఆడపడుచులకు అండగా ఉండేందుకే ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండగకు చీరలు బహుమతిగా ఇస్తుందన్నారు.

అందరి బతుకు కోరే బతుకమ్మ పండగను పేద, ధనిక బేధాలు లేకుండా అందరూ సంతోషంగా నిర్వహించుకుంటారన్నారు. బతుకమ్మను పూజించి ఆడబిడ్డలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: సెల్యూట్​: ముంపుప్రాంత ప్రజలకు ఆహారపొట్లాలు పంపిణీ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details