ETV Bharat / state

సెల్యూట్​: ముంపుప్రాంత ప్రజలకు ఆహారపొట్లాలు పంపిణీ చేసిన పోలీసులు

author img

By

Published : Oct 15, 2020, 11:03 PM IST

గత మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్​ బోయిన్​పల్లిలోని పలు కాలనీలు నీటమునిగాయి. కాగా జలదిగ్బంధంలో చిక్కుకున్న వారికి పడవల ద్వారా పోలీసులు ఆహారపొట్లాలను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

bowenpally-police-distributed-food-packets-to-people-in-the-flood-hit-area
సెల్యూట్​: ముంపుప్రాంత ప్రజలకు ఆహారపొట్లాలు పంపిణీ చేసిన పోలీసులు

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి నగరం అతలాకుతలమైంది. పలు కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం అయ్యాయి. బోయిన్​పల్లిలోని సెయిల్ కాలనీ పూర్తిగా నీటమునగడంతో కాలనీ వాసులు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో పోలీసులు వారికి అండగా నిలిచారు.. పడవల ద్వారా ఆహారపొట్లాలను తరలించి కాలనీవాసులకు వితరణ చేసి మానవత్యాన్ని చాటుకున్నారు.

గత రెండు రోజులుగా సమయానికి తిండి లేక.. కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని నీటిని తరలించే ఏర్పాట్లు చేసి కరెంటు పునరుద్ధరించాలని కోరుతున్నారు.. అదేవిధంగా కొన్ని రహదారుల వద్ద నీరు నిలిచి గుంతలు ఏర్పడ్డ చోట తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు మట్టి తెచ్చి గుంతలు పూడ్చారు.

ఇదీ చూడండి: పడవల్లో వరద బాధితుల తరలింపు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.