తెలంగాణ

telangana

వెంకటేశ్వరస్వామికి 2 కిలోల బంగారు కిరీటం.. కేసీఆర్ దంపతుల కానుక

By

Published : Mar 1, 2023, 1:00 PM IST

Updated : Mar 1, 2023, 5:22 PM IST

CM KCR Kamareddy Tour Updates : ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. కేసీఆర్ సహా ఆయన భార్య శోభతో కలిసి కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. బాన్సువాడలోని బీర్కూర్ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సంలో కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు.

CM KCR K
CM KCR K

CM KCR Kamareddy Tour Updates: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ సహా ఆయన భార్య శోభతో కలిసి కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా బాన్సువాడకు చేరుకున్నారు. వీరి వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోశ్ కుమార్‌, ఎంపీ బీబీ పాటిల్ కూడా వెళ్లారు.

బీర్కూర్ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సంలో కేసీఆర్

CM KCR visits Birkur venkateswara swamy temple : ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం కేసీఆర్ దంపతులు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఆలయంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

బీర్కూర్ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సంలో కేసీఆర్

శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు.... స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దాతల సహకారంతో స్వామివారికి చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని కేసీఆర్‌ సతీమణి ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించారు.

వెంకటేశ్వరస్వామికి 2 కిలోల బంగారు కిరీటం

వెంకటేశ్వరస్వామి కల్యాణం అనంతరం.... స్థానిక సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరయ్యారు. సమైక్యపాలనలో నిజాంసాగర్‌ దుస్థితిని ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి..... సాగర్‌ మరోసారి ఎండిపోయే ప్రసక్తేలేదన్నారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజాసేవ, ఆయన తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తానున్నన్ని రోజులు పోచారం ప్రజలకు సేవ చేయాల్సిందేనన్న ముఖ్యమంత్రి..... బాన్సువాడకు 50కోట్ల రూపాయలు, వెంకటేశ్వరస్వామి ఆలయానికి 7కోట్ల రూపాయలు ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన దృష్ట్యా బీర్కూర్​లో భద్రతా ఏర్పాట్లు కట్టు దిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక తెలంగాణలోని ఆలయలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో యాదగిరిగుట్టను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మించారు. మరోవైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. ఆ దేవాలయాన్ని కూడా పునర్ నిర్మించాడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక బాన్సువాడలోని తెలంగాణ తిరుమలగా పేరు తెచ్చుకున్నవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తారనే అంతా అనుకుంటున్నారు. కేసీఆర్ సందర్శనతో ఈ ఆలయానికి కూడా మహర్దశ వస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Mar 1, 2023, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details