తెలంగాణ

telangana

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి : కృష్ణమోహన్​

By

Published : Dec 15, 2020, 5:00 PM IST

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి డిమాండ్​ చేశారు. జిల్లాలోని ధరూర్​ మండలం కేంద్రంలో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు.

The anti-farmer laws should be repealed demand by gadwal mla krishna mohan reddy
రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి : కృష్ణమోహన్​ రెడ్డి

రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్​ మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉహసంహరించుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ... రైతులను నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అన్నదాతలకు అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చూడండి:కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details