తెలంగాణ

telangana

గద్వాల జిల్లాలో వరాహ పోటీలు

By

Published : Feb 15, 2020, 1:41 PM IST

మనం ఇప్పటివరకు కోడి, ఎడ్లు, పొట్టేళ్ల పందేలను చూశాం. కానీ మీరెప్పుడైనా... పందుల పోటీల గురించి విన్నారా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలంలో తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవంలో వినూత్నంగా వరాహ పోటీలు నిర్వహించారు.

pig competition at aiza mandal in jogulamba gadwal district
గద్వాల జిల్లాలో వరాహ పోటీలు

గద్వాల జిల్లాలో వరాహ పోటీలు

జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్న వరాహ పందేలను చూస్తే కాదేదీ పోటీకి అనర్హం అనిపిస్తోంది. ఐజ మండలంలో జరుగుతున్న తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవంలో పందుల పోటీలు నిర్వహించారు.

స్థానిక వరాహాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్​లోని అనంతపురం, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చిన 20కి పైగా వరాహాలు ఈ పోటీల్లో తలపడ్డాయి. గెలిచిన వాటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. వరాహ పందేలను చూడటానికి గద్వాల జిల్లానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.

ఈ వరాహాలకు మరింత శిక్షణ ఇచ్చి కర్ణాటక, మహారాష్ట్రలో జరిగే పోటీలకు తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి:ఆధార్​తో పాన్ లింక్ తప్పనిసరి... లేదంటే!

ABOUT THE AUTHOR

...view details