తెలంగాణ

telangana

గద్వాల కోట పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

By

Published : Jan 8, 2021, 5:54 AM IST

గద్వాల కోట లోపలి పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారన్న వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. . గద్వాలలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు వేచి ఉండే హాల్‌ నిర్మాణం కోసం గత నవంబరులో పనులు ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్లు వేసేందుకు సుమారు 9 అడుగుల మేర జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపారు.

గద్వాల కోట పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు!
గద్వాల కోట పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

గద్వాల కోట లోపలి పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారన్న వార్తలు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విశ్వసనీయ సమాచారం మేరకు.. గద్వాలలోని ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు వేచి ఉండే హాల్‌ నిర్మాణం కోసం గత నవంబరులో పనులు ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా పిల్లర్లు వేసేందుకు సుమారు 9 అడుగుల మేర జేసీబీ సహాయంతో తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో నాటి రాతితో కట్టిన కొన్ని నిర్మాణ ఆనవాళ్లతో పాటు నాలుగు పొరలుగా ఒకదానిపై ఒకటి దిమ్మెలు కూడా బయటపడ్డాయి.

దీన్ని కొందరు రహస్యంగా గుట్టుచప్పుడు కాకుండా తరలించారన్న ప్రచారం గురువారం మరోసారి జోరందుకుంది. తవ్వకాల్లో బయటపడింది రాతికట్టడం కాదని, నాటి సంస్థానాధీశులు దాచి ఉంచిన గుప్త నిధుల మూట అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీపతినాయుడు వద్ద ‘ఈటీవీ భారత్’ ఈ విషయం ప్రస్తావించగా ఆయన ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. పురాతన రాతికట్టడాలు బయటపడ్డాయని తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో నిధులు నిలిపి వేయడంతో పనులను గుత్తేదారు ఆపేశారన్నారు.

ఇవీ చూడండి:ఉద్యోగుల పీఎఫ్​, ఐటీ డబ్బులు దోచుకున్న కేటుగాళ్లు

ABOUT THE AUTHOR

...view details