తెలంగాణ

telangana

300 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన

By

Published : Nov 20, 2019, 8:06 PM IST

Updated : Nov 21, 2019, 12:05 AM IST

ఎర్రవల్లి రహదారిపై సుమారు 300 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆర్గనైజర్లకు విత్తన పత్తి కంపెనీ 490 రూపాయలు ఇస్తుంటే రైతులకు మాత్రం 410 రూపాయలు ఇవ్వడమేంటని రైతులు ప్రశ్నించారు.

farmers

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి రహదారిపై సుమారు 300 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్గనైజర్లకు విత్తన పత్తి కంపెనీ 490 రూపాయలు ఇస్తుంటే రైతులకు మాత్రం 410 రూపాయలు ఇవ్వడమేంటనీ రైతులు ప్రశ్నించారు. పండించిన పంటకు డిసెంబర్ నెలలోనే కంపెనీలు ఆర్గనైజర్లకు డబ్బులు ఇవ్వగా, ఆర్గనైజర్లు జూలై మాసంలో వడ్డీతో సహా వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి అమ్మిన తరువాత చాలాకాలం తర్వాత డబ్బులు ఇవ్వడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ శశాంక్​, జిల్లా ఇన్​ఛార్జ్​ ఎస్పీ అపూర్వ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీ. తిరుపతి కంపెనీల ప్రతినిధులతో పాటు ఆర్గనైజర్లు, కంపెనీలు మాకు రెండు వారాలు సమయం ఇవ్వాలని చెప్పడం వల్ల రైతులు నిరాశతో గద్వాల-ఎర్రవల్లి రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్​ జాం అయ్యి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. ట్రాఫిక్ జాం కావడం వల్ల పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. రైతులను బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.

300 మంది రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన

ఇదీ చూడండి : కుటుంబాన్ని బలిగొన్న సిలిండర్

Intro:tg_mbnr_09_20_seez_pathi_rythu_dharna_arrest_avb_ts10049
విత్తన పత్తి ప్యాకెట్ ధర పెంచాలని కోరుతూ.. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విత్తన పత్తి రైతుల సీడ్ పత్తి ఆర్గనైజర్ ల తో జిల్లా కలెక్టర్ శశాంక , జిల్లా ఇన్చార్జి ఎస్పీ అపూర్వ రావు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వి తిరుపతి కంపెనీల ప్రతినిధులు తో పాటు రైతులు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఉదయము 12 గంటల నుండి 3:30 గంటల వరకు సమావేశం కొనసాగింది ఈ సమావేశంలో .. విత్తన పత్తి ఆర్గనైజర్లు ఇస్తున్న నా రేటు చాలా తక్కువ రేటు ఉందని ఆర్గనైజర్లు ప్రస్తుతము కేజీ పాకెట్ కు నాలుగు వందల పది రూపాయలు ఇస్తున్నారని వాటిని పెంచాలని రైతు యొక్క డిమాండ్, కానీ నీ ఆర్గనైజర్ లకు విత్తన పత్తి కంపెనీ 490 రూపాయలు ఇస్తుంటే రైతులకు మాత్రం నాలుగు వందల పది రూపాయలు ఇవ్వడం ఏమిటి రైతులు ప్రశ్నించారు. పండించిన పంటకు డిసెంబర్ నెలలోనే కంపెనీలు ఆర్గనైజర్ లకు డబ్బులు ఇవ్వక ఆర్గనైజర్ లు జూలై ఈ మాసంలో వడ్డీతో సహా వసూలు చేస్తారని రైతులు అంటున్నారు. పత్తి విత్తన పత్తి అమ్మిన తరువాత చాలాకాలం తర్వాత డబ్బులు ఇవ్వడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని దీంతో వడ్డీలు కట్టలేక ఆర్గనైజర్ లకే బాకీ పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆర్గనైజర్లు కంపెనీలు మాకు రెండు వారాలు టైం ఇవ్వాలని ఆర్గనైజర్లు చెప్పడంతో రైతులు నిరాశతో గద్వాల ఎర్రవల్లి రహదారిపై కేటాయించారు. సుమారు 300 మంది రైతులు రోడ్డుపై కేటాయించడంతో వాహనాలు ఎక్కడ ఎక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ జాం కావడంతో భారీగా మోహరించిన పోలీసులు రైతులను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనంలో టెక్ ఇన్ చారు. పోలీసులను అరెస్టు చేసి సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ వాహనం అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించడం తో కొంత మంది రైతులు పోలీస్ వాహనం పై రాళ్లు విసిరారు.


Body:babanna


Conclusion:gadwal
Last Updated : Nov 21, 2019, 12:05 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details