తెలంగాణ

telangana

పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి: గండ్ర

By

Published : Mar 12, 2021, 3:36 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

trs mlc election campaign by mla gandra venkataramana reddy at bhupalpally in jayashankar bhupalpally district
పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించాలి: గండ్ర

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కోరారు. పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రి, ఎంసీ క్వార్టర్స్‌, ఘనపూర్‌ మండలంలో ప్రచారం నిర్వహించారు.

ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో తెరాస అభ్యర్థి, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఘన్​పూర్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు, పీఏసీఎస్ ఛైర్మన్, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మండల ముఖ్య నాయకులు, భూపాలపల్లి పట్టణ పార్టీ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, జిల్లా ముఖ్య నాయకులు, జిల్లా జాగృతి యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ఉద్యోగ, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'

TAGGED:

ABOUT THE AUTHOR

...view details