తెలంగాణ

telangana

Harish Rao Inspected Place for KCR Meetings : ఈసారి బీఆర్​ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుంది : హరీశ్‌ రావు

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 5:46 PM IST

Updated : Oct 11, 2023, 7:38 PM IST

Harish Rao Inspected Place for KCR Meeting in Jangaon : బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయి. 16, 17 తేదీల్లో వరుసగా జనగామ, సిద్దిపేట జిల్లాలో బహిరంగ సభలకు అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. సుమారు లక్ష మందికి పైగా వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.

CM KCR Meeting Arrangements in Jangaon
Harish Rao inspected Place KCR meeting

Harish Rao Inspected Place for KCR Meeting in Jangaon: కాంగ్రెస్ అంటనే మూటలు.. ముఠాలని మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) ఆక్షేపించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించకుండానే ఆ పార్టీ నాయకులు గొడవలు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్(Congress) నేతలు ఒక్క ఛాన్స్ అంటున్నారని.. గతంలో 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కానీ 11 ఏళ్లు తిరగకుండానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత ప్రగతి చేసి చూపించారని అన్నారు.

CM KCR Janagama Tour Arrangements : జనగామలో ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా వికాస్‌ నగర్‌లో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో.. హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లో పెడితే.. పాతాళానికి పోతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టో(Manifesto)లో పెట్టినవే చేయలేదని.. కానీ సీఎం మేనిఫెస్టోలో పెట్టినవీ, పెట్టనవీ కూడా చేశారని అన్నారు. ఈసారి తమ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్​రావు ఫైర్

Harish Rao Comments on Congress : జనగామ బీఆర్‌ఎస్‌ గడ్డ అని.. పక్కగా గెలిచేది పల్లా రాజేశ్వర్‌ రెడ్డేనని మంత్రి చెప్పారు. లక్ష మందికిపైగా కార్యకర్తలు వచ్చి సీఎం సభ(CM KCR Public Meeting)ను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఫించన్లు పెంచకుండా.. ఇక్కడ పెంచుతామని అబద్ధాలు చెపుతున్నారని.. దమ్ముంటే ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి.. ఇక్కడ మాట్లాడాలని సవాలు విసిరారు.

ఆచరణ సాధ్యం కానీ హామీలు కాంగ్రెస్‌కు అలవాటని విమర్శించారు. పల్లా గెలుపునకు కార్యకర్తలు అంతా సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. జనగామ నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పల్లా హామీ ఇచ్చారు. అంతకు ముందు పల్లా.. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.

Harish Rao Inspected Place for KCR Meeting in Siddipet :అంతకుముందు హరీశ్ రావు సిద్దిపేటలో పర్యటించారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైంది సీఎం కేసీఆర్ హాజరయ్యే ప్రగతి - ప్రజా ఆశీర్వాద సభ స్థలాన్నిమంత్రి హరీశ్‌ రావు పరిశీలించారు. సిద్దిపేట వేములవాడ కామన్ వద్ద గల ప్రదేశాన్ని, నాగదేవత గుడి నుంచి సిరిసిల్ల రోడ్డుకు వెళ్లే బైపాస్ రోడ్డులో ఉన్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభ విజయవంతం కావాలని ఆదేశించారు. సుమారు లక్షపైన ప్రజలు వచ్చే విధంగా సభా స్థలాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ రావు సూచించారు.

Harish Rao Inspected Place for KCR Meetings : ఈసారి బీఆర్​ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుంది : హరీశ్‌ రావు

Harish Rao Inspect Arrangements for Husnabad Public Meeting : 'బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాకే'

Harish Rao Speech at BRS Public Meeting : 'కేసీఆర్ దెబ్బకు బీజేపీ డకౌట్‌.. కాంగ్రెస్ రనౌట్.. బీఆర్‌ఎస్‌ సెంచరీ'

Harish Rao Counter on Amit Shah Comments : 'కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ఠ'

Last Updated :Oct 11, 2023, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details