తెలంగాణ

telangana

డబ్బాలో ఇరుక్కున్న కుక్క తల..

By

Published : Sep 17, 2020, 8:21 PM IST

ఓ కుక్క తల డబ్బాలో ఇరుక్కొని నానా అవస్థలు పడిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరులో జరిగింది. కొందరు యువకులు శునకం నుంచి డబ్బాను వేరు చేయాలని ముందుకు రావటంతో వారిని చూసిన కుక్క పరుగులు పెట్టింది.

The dog's head stuck in the box in jagityal district
డబ్బాలో ఇరుక్కున్న కుక్క తల..

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో ఓ శునకం తల డబ్బాలో ఇరుక్కొని నానా అవస్థలు పడింది. గ్రామంలో తిరుగుతూ ఉండగా ఓ స్థలంలో కాళీ డబ్బా కనబడటంతో డబ్బాలో ఏమో ఉందనుకుని తలను అందులో పెట్టింది. కానీ తల డబ్బాలో ఇరుక్కుపోయింది.

కొందరు యువకులు శునకం నుంచి డబ్బాను వేరు చేయాలని ముందుకు రావటంతో వారిని చూసిన కుక్క పరుగులు పెట్టింది. శునకం తలకు ఉన్న డబ్బాను చూసిన కొందరు కరోనా రాకుండా కుక్క మాస్కు ధరించిందన్నారు.

ఇదీ చదవండి:దేళ్లుగా 'కరోనా'తో ఆనందాల కాపురం

ABOUT THE AUTHOR

...view details