తెలంగాణ

telangana

సుధా చైతన్య.. ధన్వంతరి వారసురాలు.. ధరణికే అమ్మ!

By

Published : Jan 23, 2021, 4:46 PM IST

ధన్వంతరి వారసులం.. ధరణిలో దేవతలమన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సుధాచైతన్య. ఆ వైద్యురాలంటేనే గర్భిణీలకు నమ్మకం.. ప్రసవం అంటేనే పునర్జన్మగా భావించేవారు ఆమె ఉంటే ఎలాంటి గండాన్ని అయినా గట్టెక్కిస్తారన్న విశ్వాసంతో ఉంటారు. గతేడాది జగిత్యాల జిల్లాలో సర్కారీ వైద్యశాలల్లో నమోదైన ప్రసవాల్లో సగానికి సగం ఆమె చేతి మీదుగానే జరిగాయి.

ఆ వైద్యురాలంటేనే గర్భిణీ మహిళలకు నమ్మకం
ఆ వైద్యురాలంటేనే గర్భిణీ మహిళలకు నమ్మకం

ఆ వైద్యురాలంటేనే గర్భిణీలకు నమ్మకం

వైద్యం వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో అవసరం ఉన్నా లేకున్నాకొందరు వైద్యులు తప్పనిసరిగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారన్న ప్రచారం ఉంది. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రి మాత్రం అందుకు పూర్తి భిన్నం. స్త్రీ వైద్యనిపుణురాలైన డాక్టర్ సుధాచైతన్య ఐదేళ్లలో ఎంతో మంది మహిళలకు పునర్జన్మ ప్రసాదించారు. ఐదుసార్లు ఉత్తమ వైద్యురాలిగా ఎంపికయ్యారు. 2020 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు జిల్లా వ్యాప్తంగా 5వేల297 ప్రసవాలు జరగగా అందులో 2వేల395 డాక్టర్ సుధాచైతన్యనే చేయడం గమనార్హం. రాయికల్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె 2018లో మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి బదిలీపై వచ్చారు.

మహిళలకు ప్రత్యేక అభిమానం

గర్భధారణ మొదలు ప్రసవం వరకు తల్లి శిశువులకు సంబంధించిన జాగ్రత్తలు చెబుతూ... పౌష్టికాహార సూచనలిస్తూ ధైర్యాన్ని కల్పిస్తున్న సుధా చైతన్య అంటే మహిళలకు ప్రత్యేక అభిమానం. ప్రతి నెలా కనీసం 200 ప్రసవాలు చేస్తున్నారు. ఎలాంటి సమమయంలోనైనా మంచిగా స్పందిస్తారనే నమ్మకంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్‌తో వివిధచోట్ల నుంచి ఎందరో మహిళలు ప్రసవాల కోసం మెట్‌పల్లికి వస్తున్నారు.

మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రిలో ఊపిరి సలపని ఒత్తిడి ఉన్నా ఓపికగా.. వైద్యపరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారని పులువురు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. చెప్పే సమస్యలు విని డాక్టర్‌ అన్నిరకాలుగా సహకరిస్తారని సిబ్బంది చెబుతున్నారు. ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుప్రతులకు వెళ్లి ఆర్ధిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వాసుపత్రికి రావాలనే విస్తృత ప్రచారం సత్ఫలితాలిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details