తెలంగాణ

telangana

తక్షణమే వాటిని తొలగించండి - సీఎం రేవంత్​ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి లేఖ

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 7:56 PM IST

MLA Jeevan Reddy Letter To CM Revanth Reddy : తెలంగాణలోని గ్రామాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్​కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. గత ప్రభుత్వానికి ఎక్సైజ్​శాఖ ఆదాయ శాఖగా మారిందని ఆరోపించారు.

MLC Jeevan Reddy letter To CM Revanth on Illegal Liquor Shops
MLA Jeevan Reddy Letter To CM Revanth Reddy

MLA Jeevan Reddy Letter To CM Revanth Reddy : తెలంగాణలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి లేఖ రాశారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ (KCR) నియంతృత్వ ధోరణిలో పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఉద్యమ లక్షణాలను నీరు కార్చారని విమర్శించారు.

పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు - అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా శిరసా వహిస్తా : జీవన్​రెడ్డి

కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. అందుకే ప్రజలు మార్పు రావాలని కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.

MLC Jeevan Reddy letter To CM Revanth on Illegal Liquor Shops : ఆరోగ్య శ్రీని కొనసాగించడం, మహిళలకు ఆర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు లబ్ధి చేకూరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తక్షణమే తొలగించాలనడం హర్షనీయమన్నారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఆదాయ శాఖగా మారిందని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లేదు: జీవన్‌రెడ్డి

గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని వారిని మద్యానికి ప్రియులుగా, బానిసలుగా చేసిందని ఆరోపించారు. ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులు ఉండే వాటిని తక్షణమే తొలగించాలని, దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయాలని సీఎం రేవంత్​కు లేఖ రాసినట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) తెలిపారు.

Jeevan Reddy Slams BRS Ruling :ముఖ్యమంత్రి శ్వేత పత్రం రిలీజ్ చేస్తే బీఆర్ఎస్​లో వణుకు పుడుతుందని అందుకే బీఆర్ఎస్(BRS) నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. దళితబంధు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం మాత్రమే వచ్చిందని దళితులు గ్రహించారని తెలిపారు.

ఈసారి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పారు. హుస్నాబాద్​ను తిరిగి కరీంనగర్​లో కలపాలన్న డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వ (Congress) హయాంలో పరిష్కారం అవుతుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.

కొత్త ప్రభుత్వాన్ని దీవించాల్సిందిపోయి, ఎలా నడుస్తుందో చూస్తాననడం సరికాదు : జీవన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details