తెలంగాణ

telangana

Farmers Protest: చక్కెర ఫ్యాక్టరీ ముందు రైతుల ఆందోళన

By

Published : Jun 2, 2021, 7:45 PM IST

చక్కెర ఫ్యాక్టరీ మూతపడటం వల్ల చెరుకు రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కర్మాగారాన్ని తెరిపించాలని కోరారు.

Farmers Protest
చక్కెర ఫ్యాక్టరీ ముందు రైతుల ఆందోళన

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ మూసివేతను నిరసిస్తూ చెరుకు రైతులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్మాగారం ముందు ఆందోళన చేశారు. చక్కెర ఫ్యాక్టరీ మూతపడటం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బతుకులు బాగు పడతాయనుకున్నప్పటికీ కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే స్పందించి మూతపడ్డ చక్కెర కర్మాగారాన్ని తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

TAGGED:

ABOUT THE AUTHOR

...view details