తెలంగాణ

telangana

heavy rush at kondagattu anjanna temple : కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

By

Published : Jan 18, 2022, 1:54 PM IST

heavy rush at kondagattu anjanna temple : కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

heavy rush at kondagattu anjanna temple, kondagattu temple
అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

heavy rush at kondagattu anjanna temple : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. క్యూలైన్లు నిండిపోయి వెలుపల వరకు బారులుతీరారు. దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

ఆలయ పరిసరాల్లో వాహనాలు

సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న దృష్ట్యా భక్తుల రద్దీ పెరిగింది. జాతరకు ముందు అంజన్నను దర్శించుకోవడం భక్తులు ఆనవాయితీగా వస్తోంది. దీనికి తోడు మంగళవారం కావటంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం

ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేలకుపై భక్తులు ఆలయానికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:తల్లిదండ్రులూ జాగ్రత్త.. పిల్లలకు వెహికిల్ ఇస్తే జైలుకే..!

ABOUT THE AUTHOR

...view details