ETV Bharat / state

తల్లిదండ్రులూ జాగ్రత్త.. పిల్లలకు వెహికిల్ ఇస్తే జైలుకే..!

author img

By

Published : Jan 18, 2022, 1:04 PM IST

traffic police warning : సరదా కోసం పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు కొందరు. పోరు పడలేకు మరికొందరు ఇస్తున్నారు. ఇలా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ తరుచూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. అయితే దీనిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. పిల్లలకు వెహికిల్ ఇస్తే తల్లిదండ్రులు కూడా జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

traffic police warning, minors driving
తల్లిదండ్రులూ జాగ్రత్త.. పిల్లలకు వెహికిల్ ఇస్తే జైలుకే..!

traffic police warning : కొద్దిరోజుల నుంచి విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు... వారికి వాహనాలు ఎవరు ఇస్తున్నారు? వాహనాలు నడపడంలో అనుభవం ఉందా? రాత్రివేళల్లో బైకులు, కార్లు నడిపేప్పుడు మద్యం తాగుతున్నారా? అన్న అంశాలపై ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. తల్లిదండ్రులు, ప్రైవేటు సంస్థలు, మొబైల్‌యాప్‌ల ద్వారా బైకులు, కార్లు కిరాయికి ఇస్తున్న కంపెనీల నుంచి వాహనాలు వస్తున్నాయని గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4385 కేసులు నమోదు చేశారు.

30శాతం మంది వారే..

బైకులు, కార్లు నడుపుతున్న యువకులు, మైనర్లు(ఇంటర్మీడియేట్‌ విద్యార్థులు) కొంతమంది తల్లిదండ్రులతో పోట్లాడి ద్విచక్రవాహనాలను కొనాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. కళాశాలకు తాము బస్సుల్లో వెళ్తున్నామని, స్నేహితులంతా బైక్‌లలో వస్తున్నారని, ఇజ్జత్‌ పోతోందంటూ తల్లిదండ్రులకు చెబుతున్నారు. కొందరు మైనర్లు బైకుల కోసం తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారని, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనాలంటూ బలవంత పెడుతున్నారని ట్రాఫిక్‌ పోలీసు అధికారుల సర్వేలో తేలింది. బైకులపై లైసెన్స్‌ లేకుండా రేసుల్లో పాల్గొంటున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటివారు తొలిసారి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడితే.. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నారు.

.

ఇదీ చదవండి: Tipper accident at Batasingaram : టిప్పర్ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టి పల్టీలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.