తెలంగాణ

telangana

'ప్రజలు ఏమైనా సీఎం బయటకు రావడం లేదు'

By

Published : Oct 17, 2020, 7:38 PM IST

వర్షాలకు పంటలు దెబ్బతిన్నా.. హైదరాబాద్‌ జలమయమైనా.. సీఎం ప్రగతి భవన్‌ నుంచి బయటకు రావటంలేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి విమర్శించారు. దెబ్బతిన్న పంటలను అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరారు.

congress mlc speak about rains in telangana
'సీఎం ప్రగతి భవన్‌ నుంచి బయటకు రావడం లేదు'

రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను అంచనా వేసి పరిహారం చెల్లించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి కోరారు. వర్షాలతో వరి దెబ్బతిందని.. మక్కలు తడిచిపోయాయని.. పత్తిపంటకు నష్టం వాటిల్లిందని జగిత్యాలలో చెప్పారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్నా.. హైదరాబాద్‌ జలమయమైనా సీఎం ప్రగతి భవన్‌ నుంచి బయటకు రావటంలేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌కు రహదారి మార్గంలో రాలేకపోతే కనీసం ఏరియాల్​ సర్వే చేసి ప్రజల బాధలు చూడాలన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద ఎకరాకు రూ. 20 వేలు అందించాలన్నారు. మొక్కజొన్న క్వింటాకు వెయ్యి కూడా ధర దక్కటంలేదని.. మక్కలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలన్నారు.

ఇదీ చదవండి:సీసీటీవీ​ వీడియో: గ్రామ సింహంపై చిరుతపులి దాడి

ABOUT THE AUTHOR

...view details