తెలంగాణ

telangana

WEATHER REPORT: బలహీనంగా రుతుపవనాలు.. మాదిరి వర్షాలు కురిసే అవకాశం

By

Published : Aug 1, 2021, 7:17 AM IST

రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉండటం వల్ల ఆది, సోమ వారాల్లో ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

weather-report-in-telangana
బలహీనంగా రుతుపవనాలు.. మాదిరి వర్షాలు కురిసే అవకాశం..

రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుల్కల్‌(సంగారెడ్డి జిల్లా)లో 2, పాన్‌గల్‌(వనపర్తి)లో 1 సెం.మీ. వర్షం కురిసింది.

గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రం చిగురాకుల వణికింది. పలు చోట్లు వరదలు ముంచెత్తాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. చెరువులు, వాగులు మత్తడి పోసి... చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

మరికొన్ని చోట్ల... రోడ్లు తెగిపోయాయి. వరద నీరు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ముంపులో ఉన్న గ్రామ ప్రజలకు అధికారులు సహాయ చర్యలు అందించారు. విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా వర్షాలు తగ్గడంతో... ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

ఇదీ చూడండి:Friendship Day: మాటలకందని స్నేహ బంధం... ఎంతో మధురం..!

ABOUT THE AUTHOR

...view details