తెలంగాణ

telangana

వ్యాక్సిన్ కోసం నిరీక్షణ.. 'రోజూ గంటలపాటు ఎండలో ఉంటున్నాం'

By

Published : Apr 30, 2021, 3:56 PM IST

సీతాఫల్​మండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కోసం రోజూ వస్తున్నామని స్థానికులు వాపోయారు. ఎండలో గంటలపాటు నిరీక్షిస్తున్నామని... అయినా టీకా గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ కేంద్రం వేర్వేరుగా ఉండాలని డిమాండ్ చేశారు.

vaccination in hyderabad, hyderabad vaccine program
హైదరాబాద్​లో టీకా కార్యక్రమం, హైదరాబాద్​లో వ్యాక్సినేషన్

హైదరాబాద్​ సీతాఫల్​మండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. మూడు రోజులుగా టీకా కోసం వస్తున్నా తమకు నిరాశే మిగులుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇవాళ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఇంకా ప్రారంభం కాలేదని వాపోయారు. ఎండలో గంటలపాటు నిల్చుని పడిగాపులు కాస్తున్నప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

వ్యాక్సిన్ విషయంలో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. వ్యాక్సినేషన్, కొవిడ్ నిర్ధరణ పరీక్షలు ఒకే దగ్గర చేయడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉందని అన్నారు. వీటిని వేర్వేరుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు.

ఇదీ చదవండి:ప్రైవేటు ఆస్పత్రులకు టీకా డోసుల పంపిణీ నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details