తెలంగాణ

telangana

VENKAIAH NAIDU ON CLIMATE: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: వెంకయ్య నాయుడు

By

Published : Nov 23, 2021, 10:31 PM IST

భూతాపం కారణంగా సముద్ర తీర ప్రాంతాలు తీవ్ర ప్రతికూలతలకు లోనవుతున్నాయని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(VICE PRESIDENT VENKAIAH NAIDU) అన్నారు. భావితరాలకు అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ పర్యవరణాన్ని పరిరక్షించాల్సిన అవసరముందన్నారు. ఏపీలోని విశాఖ పర్యటనలో ఉన్న ఆయన... బీచ్ రోడ్​లోని యోగా విలేజ్​లో ఉన్న అటవీ పరిశోధన, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రాన్ని సందర్శించారు.

VENKAIAH NAIDU
VENKAIAH NAIDU

వాతావరణ మార్పుల నేపథ్యంలో(VICE PRESIDENT ON CLIMATE CHANGE) పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. భూతాపం కారణంగా సముద్రం తీర ప్రాంతాలు తీవ్ర ప్రతికూలతలకు లోనవుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు అందమైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన భూమిని అందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని సూచించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన... బీచ్ రోడ్​లోని యోగా విలేజ్​లో ఉన్న అటవీ పరిశోధన, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థా కేంద్రాన్ని సందర్శించారు. ఇదే భవనంలో సముద్ర పర్యావరణ వ్యవస్థపై ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. పర్యావరణానికి హాని చేయని విధంగా నడుచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.

'వాతావరణ మర్పుల కారణంగా సముద్రమట్టాల పెరుగుదల'

విజ్ఞానశాస్త్ర అంతిమ లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడమేనన్న ఉపరాష్ట్రపతి... సముద్ర వాతావరణంలో పాడవ్వని కలపతో తయారు చేసిన 100 పడవలను ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మత్స్యకారులకు ఈ సంస్థ అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్న ఆయన.. దీనివల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భూభాగం తగ్గిపోవడం, భూమిలో లవణీయత పెరగడం లాంటివి చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులు వ్యవసాయం మీద, నివాస సముదాయాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్నారు. పర్యావరణ వ్యవస్థల మీద ఈ అసమతుల్యతను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

'ఆ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి'

పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. 2017–19 మధ్యకాలంలో దేశంలో 54 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవుల విస్తీర్ణం పెరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం చేయవలసింది ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు.

ఉపరాష్ట్రపతి ప్రారంభించిన వైజ్ఞానిక ప్రదర్శనా కేంద్రంలో సముద్రపు బయో ఫౌలింగ్ కారణంగా దెబ్బతిన్న చెక్క నమూనాలు, సముద్ర జీవుల అవశేషాలు, పరిరక్షించిన చెక్క నమూనాలు తదితరాలను ఏర్పాటు చేశారు. తూర్పు కనుమల్లో ఉన్న పక్షుల జాతులు, విశాఖపట్నం జిల్లాలోని 114 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం వెంబడి మడ అడవులతో అనుసంధానమైన పక్షుల జాతుల గురించి అనేక ఆసక్తికర విషయాలను ఇక్కడ ఉంచారు.

ఇదీ చూడండి:waiting for disability pension: దయలేని దేవుడు.. దయచూపండి మీరు..!

ABOUT THE AUTHOR

...view details