తెలంగాణ

telangana

సాగు పరిశోధనలకు ప్రభుత్వాలు నిధులు పెంచాలి: వెంకయ్య నాయుడు

By

Published : May 14, 2022, 1:53 PM IST

Updated : May 14, 2022, 4:55 PM IST

Vice President in Graduation Ceremon

Vice President in Graduation Ceremony: వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు అధిగమించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలకు మరింత పదును పెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి వ్యవసాయ విద్యార్థి గ్రామాలు సందర్శించి రైతుల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్​ రాజేంద్రనగర్​లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థలో నిర్వహించిన గ్యాడ్యుయేషన్​ వేడుకలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.

Vice President in Graduation Ceremony: ప్రభుత్వాలు వ్యవసాయ పరిశోధనలకు నిధుల కేటాయింపును పెంచాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సాగురంగంలో సవాళ్లు అధిగమించాలంటే పరిశోధనలకు మరింత పదునుపెట్టాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని.. రైతులు బియ్యం, గోధుమల నుంచి చిరుధాన్యాలు నూనెపంటల వైపు మళ్లేలా కృషిచేయాలని.... విద్యార్థులకు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు సాగును లాభదాయకం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ- నార్మ్‌ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో 2017-22 బ్యాచ్​లకు సంబంధించి 163 మంది విద్యార్థులకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు.

సాగు పరిశోధనలకు ప్రభుత్వాలు నిధులు పెంచాలి: వెంకయ్య నాయుడు

"వ్యవసాయ పరిశోధనలపై ఖర్చు పెట్టకుండా ఏ దేశమూ ఉత్పాదకతను పెంచలేదు. దేశంలో విస్తృత వ్యవసాయ పరిశోధనా నెట్‌వర్క్‌ ఉంది. దేశంలో వ్యవసాయ పరిశోధనా సామర్ధ్యాన్ని మరింత పెంచి.. సాగు ఉత్పాదకతలో స్థిరత్వాన్ని సాధించాలి. అందుకు మొదట పరిశోధనలకు పెట్టే వ్యయాన్ని పెంచాలి. వ్యవసాయ జీడీపీలో 1శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తూ ఇతర దేశాలకంటే చాలా వెనుకబడిఉన్నాం. ఆర్‌ అండ్‌ డీకి నిధులు పెంచాల్సిన అవసరముంది." -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

అంతకుముందుగా మాతృభాషపై విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పలు సూచనలు చేశారు. ఎన్ని భాషలైనా నేర్చుకోవాలి కానీ మాతృభాషను మరవొద్దని వెంకయ్య నాయుడు అన్నారు. పిల్లలకు మాతృభాష అలవాటు చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

'ఉపరాష్ట్రపతి అయినప్పుడు మీడియా మిత్రులు నా దగ్గరకు వచ్చి ఒక విషయం అడిగారు. సంకోచిస్తూ నా వస్త్రధారణ గురించి అడిగారు. డ్రెస్‌లో మార్పు లేదు... కేవలం అడ్రస్‌ మాత్రమే మారిందని నేను చెప్పాను. వస్త్రధారణ అనేది ఒక గుర్తింపు. భాష కూడా ప్రజల గుర్తింపు. అందుకే ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలో ఉండాలి. పిల్లలు మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించాలి. మాతృభాష అనేది కంటిచూపు. ఇతర భాషలు కళ్లజోడు. కంటి చూపు ఉంటేనే కళ్లజోడు పనిచేస్తుంది. అందుకే మనం మాతృభాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆంగ్లంతో సహా ఇతర భాషలకు నేను వ్యతిరేకం కాదు. ఎన్ని భాషలైనా నేర్చుకోండి. కానీ కచ్చితంగా మాతృభాషను మరవద్దు.' -వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి

ఇవీ చదవండి:'ఐదేళ్లు కరవు వచ్చినా హైదరాబాద్​కు తాగునీటి కొరత ఉండదు'

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Last Updated :May 14, 2022, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details