తెలంగాణ

telangana

నచ్చిన మగాడి కోసం ఎంతకైనా తెగిస్తాడు - ఏం దోచినా డైరీలో రాస్తాడు

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 7:02 AM IST

Updated : Dec 28, 2023, 8:50 AM IST

Variety Thief in Hyderabad : చిన్నప్పుడు మంచి పనులు చేస్తే డైరీలో రాసుకోవాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే అవి చదివినప్పుడు మళ్లీ అలాంటి పనులు చేసేందుకు ఉపయోగపడతాయని. కానీ ఓ వ్యక్తి తాను చేసిన దొంగతనాలన్ని రాసుకుని దాచుకున్నాడు. ఎందుకో తెలుసా తాను పొరపాటున పోలీసులకు దొరికిపోతే పక్కా లెక్క తెలియాలని. దొరికిపోయినా పర్లలేదు ఎంత దోచుకున్నామో ఆ లెక్క ముఖ్యం బిగులు అన్నకున్నాడేమో. చివరికి పోలీసులకు చిక్కడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. వింత దొంగ స్టోరీ ఏంటో ఓసారి తెలుసుకుందాం రండి.

OU Police Caught Thief
Different Thief Hyderabad

ఈ దొంగ రూటే సపరేటు చోరీ చేసి చీటి పెడ్తాడు ఏం దోచాడో డైరీలో రాస్తాడు

Variety Thief in Hyderabad : దొంగతనం చేశాక ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తూ వివిధ రకాల ప్రణాళికలు వేసుకుంటారు దొంగలు. ఎటు నుంచి ఏ ప్రమాదం వచ్చినా పారిపోవడానికి మెలకువలు నేర్చుకుంటారు. ఇది అందరూ దొంగలు చేసే పనే. కానీ​ ఆ దొంగ మాత్రం వేరే లెవల్​. ఎక్కడైనా చోరీ చేస్తే ఎంత నగదు దోచుకున్నాడో, ఎన్ని నగలు పట్టుకెళ్తున్నాడో తెలిసేలా పక్కగా చీటీ రాసి మరీ పెట్టుకుంటాడు.

Thief Dairy in Hyderabad : అక్కడితో అయిపోలేదు. దొంగతనం చేసిన వివరాలను ఎక్కడైతే చోరీ చేస్తాడో అక్కడే పెట్టి వచ్చేస్తాడు. సినీ నటుడు రవితేజ నటించి కిక్​ సినిమాలో దొంగతనం చేసేందుకు క్లూ ఇచ్చి చోరీ చేస్తే, ఈ దొంగ దానికి భిన్నంగా చేసిన తరవాత ఏం చోరీ చేశానో చెబుతున్నాడన్నమాట. ఈ దొంగ ఎక్కడ, ఎప్పుడు, ఎంత దొంగతనం చేశాడో పక్కగా తన డైరీలో రాసుకున్నాడు. ఏంటి నిజమేనా అనిపిస్తుందా అయితే ఆ దొంగ గురించి ఓయూ ఏసీపీ సైందయ్య మాటల్లో తెలుసుకుందాం.

అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌ - పలు దుకాణాల్లో నగదుతో పాటు సరుకులు చోరీ

Donga Dairy Hyderabad: ఈ దొంగ పేరు రత్లావత్‌ శంకర్‌నాయక్‌ అలియాస్‌ రాజేశ్‌రెడ్డి. నాగర్‌కర్నూల్‌ జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన ఇతడు.. హత్యాయత్నం కేసులో ఓసారి జైలుకు వెళ్లాడు. అక్కడ చోరీ కేసులో అరెస్టైన ఒక యువకుడు శంకర్‌నాయక్‌కు పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురాలవాట్లకు బానిసయ్యాడు. విలాసాల కోసం దొంగతనాలు చేయడం మెుదలు పెట్టాడు.

చోరీ చేసిన ఆభరణాలు తాకట్టు పెట్టి జల్సాలు చేస్తాడు. స్వలింగ సంపర్కం కోసం ఎంతకైనా తెగిస్తాడని పోలీసులు తెలిపారు. వారిని సంతోషపెట్టేందుకు కావాల్సిన డబ్బు కోసం ఇళ్లలోకి చొరబడి నగదు, నగలు చోరీ చేస్తాడని వివరించారు. పెద్ద లాడ్జీలు, హోటళ్లలో బస చేయడం, ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరించడం సరదా. పోలీసులకు పట్టుబడిన సమయంలో 11 వేల విలువైన దుస్తులు, 5వేల విలువైన చెప్పులతో టిప్‌టాప్‌గా తయారై ఉన్నాడు.

SBI ఏటీఎంలో భారీ చోరీ- స్కార్పియోలో వచ్చి నిమిషాల్లోనే నగదు మాయం

గతంలో శంకర్‌నాయక్‌ ఒక ఇంట్లో చోరికి పాల్పడ్డాడు. అతడు కొట్టేసిన నగలు 10 తులాలైతే 20 తులాలు పోయాయంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పట్టుబడినపుడు తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవటంతో రూటు మార్చాడు. అప్పటి నుంచి ఎక్కడ దొంగతనం చేసినా ఆ ఇంట్లో కొట్టేసిన నగదు, నగల వివరాలను చీటీ రాసి అక్కడ ఉంచేవాడు. అదే వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన వద్ద ఉన్న డైరీ చూపి నమ్మించే ప్రయత్నం చేసేవాడు. 2022లో మేడిపల్లి పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి అతన్ని జైలుకు పంపారు. అప్పటికే శంకర్‌నాయక్‌ 94 దొంగతనాలు చేసినట్టు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యాయి.

"శంకర్​నాయక్​ అనే వ్యక్తి దొంగతనం చేసి అక్కడే చిటీ పెట్టి వెళ్తాడు. ఇలానే హబ్సిగూడలో మూడు దొంగతనాలు చేశాడు. మళ్లీ ఈ విషయాలను తన డైరీ రాసుకున్నాడు. తనపై 94 కేసులు ఉన్నాయి. అతని కోసం దర్యాప్తు చేయగా ఇవాళ దొరికాడు. రిమాండ్​కు పంపించాం." -సైందయ్య, ఓయూ ఏసీపీ

OU Police Caught 94 Cases Thief : నిందితుడు శంకర్‌నాయక్‌ నుంచి 13 లక్షల 50వేల రూపాయల విలువైన ఆభరణాలు, ద్విచక్రవాహనం, మూడు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలలో ప్రముఖ బంగారు దుకాణాల్లో తాకట్టు పెట్టినట్టిన రశీదులను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. వాటితో పాటు అతడి డైరీ కూడా దొరికింది. ఆ డైరీ తెరిచి చూసిన పోలీసులు షాక్ అయ్యారు.

ఆ డైరీలో శంకర్ తాను ఏ రోజు, ఏ సమయానికి, ఏ ఇంట్లో, ఎంత సొమ్ము దోచాడో పక్కాగా లెక్క రాసుకున్నాడు. ఇదేందయ్యా ఇది ఇట్ల రాసినవ్ అని దొంగను పోలీసులు అడగ్గా నేనెంత దోచానో మీక్కూడా లెక్క తెల్వాలిగా సారూ అని సమాధానం చెప్పాడు. అంతే కాకుండా తాను దొంగతనం చేసిన ఇంట్లోనూ తాను ఎంత సొమ్ము దోచాడో ఓ చీటీలో రాసి పెట్టి వెళ్తాడట. కరుడుగట్టిన దొంగలను చూశాం కానీ ఇలా లెక్కా పత్రం స్పష్టంగా మెయింటైన్ చేసే దొంగలను చూడటం ఇదే మొదటిసారి అని పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదైతేనేం కేసు కూపీ లాగడానికి ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కడెక్కడ ఎంతెంత దోచాడో లెక్కలు చూపించాడని పోలీసులు అంటున్నారు.

శామీర్​పేట్​ ఎల్లమ్మ ఆలయంలో చోరీ - సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు

ఆకతాయి ఒక్కడంట చిల్లరంత మూట గట్టి - దూకేను గోడలంట దుమ్ముకొట్టి కళ్లలోన దొంగ దొంగ

Last Updated :Dec 28, 2023, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details