తెలంగాణ

telangana

కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్​ రెడ్డి

By

Published : Feb 12, 2021, 4:16 PM IST

గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ మద్దతు లేకుంటే తెరాస సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యేదని.... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కుమ్మక్కు రాజకీయాలతో మేయర్‌, ఉపమేయర్ పదవులను దక్కించుకున్నారని ఆక్షేపించారు.

kishan reddy criticized trs and mim parties
కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్​ రెడ్డి

తెరాస, ఎంఐఎం మధ్య పొత్తు ఉందని... తెరాసకు ఓటేసినా మజ్లిస్​కు ఓటేసినట్టేనని గతంలోనే చెప్పామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలతోనే జీహెచ్​ఎంసీ మేయర్​, ఉపమేయర్​ పదవులు దక్కించుకున్నాయని ఆక్షేపించారు.

గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడా సరైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి జీహెచ్​ఎంసీని దిగజార్చారని ధ్వజమెత్తారు.

కుమ్మక్కు రాజకీయాలతో పదవులు దక్కించుకున్నారు: కిషన్​ రెడ్డి

ఇదీ చూడండి:రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? : కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details