తెలంగాణ

telangana

తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలకు అమిత్ షా పిలుపు

By

Published : Feb 27, 2023, 2:23 PM IST

Amit Shah Call To Telangana Bjp Leaders: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు దిల్లీకి రావాల్సిందిగా సమాచారం పంపారు. ఈ మేరకు రేపు ఉదయం పార్టీ ముఖ్యనేతలు దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దిల్లీలో నేతలు అమిత్ షాతో సమావేశమవుతారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

Amit Shah Call To Telangana Bjp Leaders
Amit Shah Call To Telangana Bjp Leaders

Amit Shah Call To Telangana Bjp Leaders: తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ దృష్టి సారిస్తోన్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్​కు తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటికే రాష్ట్ర నేతలు చెప్పుకుంటున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఎలగైనా అధికారం చేజిక్కుంచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న బీజేపీ... ఆ దిశగా మరిన్ని చర్యలు చేపడుతోంది.

ఇప్పటికే రాష్ట్రానికి చెందిన నేతలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై ఎప్పటికప్పుడు బీజేపీ జాతీయ సీనియర్ నేత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్​ షా రాష్ట్ర నేతలకు రేపు దిల్లీ రావాలంటూ సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం కల్లా దిల్లీకి రావాలని సూచినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు సోమవారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో వారు సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్‌ షా వారితో చర్చించనున్నారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించేందుకు పక్కా ప్లాన్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికల్లా.. కేంద్రం నుంచి తెలంగాణలో వరుస పర్యటనలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం సక్సెస్ కావడంతో.. ఇక తెలంగాణలోనూ ఈ ప్లాన్​నే అమలు చేయాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే బండి సంజయ్ పాద యాత్ర గ్రామాల్లోకి వెళ్లగా.. తాజాగా ప్రజా గోస - బీజేపీ భరోసా లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చిందనే బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే కేంద్ర మంత్రులు పర్యటలు ప్రారంభించారు. ఆ మధ్య తెలంగాణకు ప్రధాని మోదీ పర్యటన చేయాల్సి ఉంది కానీ.. అది ఎందుకో ఖరారు కాలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details