తెలంగాణ

telangana

TSPSC PAPER LEAKAGE CASE UPDATE : ఎగ్జామ్​లో టాపర్​.. ప్రశ్న అడిగితే నో మేటర్​

By

Published : May 28, 2023, 6:27 AM IST

Updated : May 28, 2023, 9:47 AM IST

TSPSC Paper Leakage Case : ఏ ప్లస్ బీ హోల్ స్వ్కేర్ ఎంత అంటే.. చదువుకున్న ఎవరైనా సమాధానం చెబుతారు. కానీ ఏఈ పరీక్షలో టాపర్​గా నిలిచిన ఓ అభ్యర్థి మాత్రం దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. ఇలా కనీస పరిజ్ఞానం లేకపోయినా గణితం తెలియకున్నా చరిత్ర, ఆర్థికశాస్త్రం అంశాలపై పట్టు సాధించకున్నా పోటీ పరీక్షల్లో నెగ్గారు. అడ్డదారిలో కొనుగోలు చేసిన ప్రశ్న పత్రాలతో టాపర్స్​గా నిలిచారు. కానీ కథ అడ్డం తిరిగింది. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం బయట పడటంతో ఈ టాపర్ల అసలు రహస్యం వెలుగుచూసింది.

TSPSC PAPER LEAKAGE CASE UPDATE
TSPSC PAPER LEAKAGE CASE UPDATE

ఏఈ పరీక్ష టాపర్‌.. ఏ ప్లస్‌ బీ హోల్‌ స్క్వేర్‌ తెలియదు

TSPSC AE Paper Leakage case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్ కేసులో.. ప్రశ్న పత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారు ఎందురు ఉన్నారనే అంచనా వేయటం సిట్​కు సవాల్​గా మారింది. దర్యాప్తులో పోలీసులు సమయస్పూర్తిని ప్రదర్శించారు. గ్రూప్ 1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లను ప్రశ్నించాలనుకున్నారు. టాపర్లను వేర్వేరుగా సిట్ కార్యాలయానికి పిలిపించి మాస్టర్ ప్రశ్న పత్రాలను దగ్గర ఉంచుకొని సమాధానాలు రాబట్టారు. వారి నుంచి వచ్చే జవాబులు, కదలికల ఆధారంగా ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించారు. ఈ ప్రక్రియలో అధికారులు గుర్తించిన అభ్యర్థులు లీకేజ్ వ్యవహారం కేసులో నిందితులయ్యారు.

HOW to SIT Officers Investigation TSPSC Accused : దర్యాప్తులో భాగంగా విచారణకు పిలిచినప్పుడు ఈ టాపర్లు సిట్ పోలీసులను బురిడీ కొట్టించేందుకు పలు రకాలుగా ప్రయత్నించారు. తాము తప్పు చేయలేదని నమ్మించేందుకు రకరకాల ఎత్తులు వేశారు. కానీ పోలీసుల ముందు వీరి ఎత్తులు నిలబడలేదు. పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేసి ప్రశ్నపత్రాలు ఎలా చేతులు మారుతూ వచ్చాయనేది గుర్తిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా.. ఏఈ పరీక్షలో టాపర్​గా ఉన్న ఓ యువకుడిని పోలీసులు ప్రశ్నించి విస్తుపోయారు. లెక్కల్లో సులువైన ప్రశ్న అడిగితే అతడు తెల్లమొహం వేశాడు. 20 ప్రశ్నలు సందిస్తే కనీసం రెండింటికీ కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు.

TSPSC LEKAGE CASE : మరో అభ్యర్థి సిట్ పోలీసులు తాను కొనుగోలు చేసిన ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు వరుస క్రమంగా రాసుకొని వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. చేతికి వచ్చిన ప్రశ్నపత్రాలతో పరీక్ష రాసిన వారు సిట్ దర్యాప్తులో తడబడుతూ దొరికిపోయారు. మార్చి 5న పరీక్ష రాసిన వీరంతా రెండు నెలలకే సమాధానాలు మరచిపోయామంటూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. మరికొందరు తప్పుచేసినట్టు అంగీకరించారు. కొందరు మాత్రం తామేం తప్పు చేయలేదని పరీక్షలో టాపర్లుగా ఉండటం తప్పా.. అంటూ పోలీసులను నిలదీశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Latest news in TSPSC PAPER LEAK CASE : సిట్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయిన వారు పరీక్షల్లో మార్కులు ఎలా వచ్చాయనేది నిరూపించుకోలేక చివరకు తమ తప్పులను అంగీకరించినట్టు సమాచారం. పోలీసులు అనుమానం వ్యక్తం చేసి అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరికి గతంలో అరెస్ట్ అయిన వారితో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల్లో ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరించి పక్కా అధారాలు వారి మందు ఉంచడంతో చేసేది ఏమీ లేక పోలీసుల ముందు నిజం ఒప్పుకుంటున్నారు.

ఇవీ చదవండి :

Last Updated : May 28, 2023, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details