తెలంగాణ

telangana

TS Weather news: రానున్న మూడు రోజులు వర్షాలే వర్షాలు.. ఇవాళ కూడా కురిసే అవకాశం..

By

Published : Jun 29, 2022, 3:52 PM IST

TS Weather news: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు కురవచ్చని హెచ్చరించింది.

TS Weather news
హైదరాబాద్ వాతావరణ కేంద్రం

TS Weather news: రాష్ట్రంలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిన్న జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

నిన్నటి నుంచి సుమారు 19 డిగ్రీలన అక్షాంశం వెంబడి ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా ఉన్న షీర్ జోన్ ఈరోజు బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. తూర్పు, పడమర ద్రోణి ఈరోజు ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా తీరం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతోందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details