తెలంగాణ

telangana

356వ రోజుకి చేరిన అమరావతి రైతుల ఆందోళన

By

Published : Dec 7, 2020, 4:10 PM IST

అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటం 356వ రోజు కొనసాగుతోంది. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉద్దండరాయుని పాలెంలో అమరావతి మహిళలపై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు.

thullur
356వ రోజుకి చేరిన రాజధాని అమరావతి రైతుల ఆందోళన

రాజధాని అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్‌ రైతులు చేస్తున్న పోరాటం 356వ రోజుకి చేరుకుంది. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉద్దండరాయుని పాలెంలో అమరావతి మహిళలపై రాళ్ల దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల శిబిరం తొలగించే వరకూ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై ఎంపీ నందిగాం సురేష్ అనుచరులు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు.

356వ రోజుకి చేరిన రాజధాని అమరావతి రైతుల ఆందోళన

దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయకుండా.. ఆందోళనలకు ఆంక్షలు విధించడాన్ని రైతులు తప్పుబట్టారు. పెయిడ్ ఆర్టిస్టులతో మూడు రాజధానుల ఉద్యమం నడుస్తోందని.. వారితో తమను తిట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాజధానిలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు రోడ్డుపై ఆందోళన చేస్తుండటంతో తుళ్లూరులో భారీగా పోలీసులు మోహరించారు.

ఇవీ చూడండి...ఉద్యోగులందరూ భారత్​ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలి: టీఎన్జీవో

ABOUT THE AUTHOR

...view details