తెలంగాణ

telangana

కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట

By

Published : Jan 9, 2023, 6:06 PM IST

Updated : Jan 9, 2023, 7:10 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట

18:02 January 09

కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ తరలింపుపై సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. మూడో టీఎంసీపై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది. మూడో టీఎంసీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తుది ఉత్తర్వుల మేరకే అనుమతులు లోబడి ఉంటాయని కూడా తేల్చి చెప్పిన ధర్మాసనం.. పరిహారం తీసుకొని భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కూడా అనుమతినిచ్చింది.

కాళేశ్వరం మూడో టీఎంసీ కోసం భూ సేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహా కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్‌ వాదనలు వినిపించారు. తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్‌లో సవరణ చేయాలని కోరారు. తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆర్డర్‌లో సవరణలు చేసింది.

ఇవీ చూడండి..

'మతమార్పిళ్లు' చాలా తీవ్రమైన అంశం.. రాజకీయ రంగు పులమొద్దు : సుప్రీం

తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం.. గవర్నర్ వాకౌట్.. చరిత్రలో తొలిసారి!

Last Updated :Jan 9, 2023, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details