తెలంగాణ

telangana

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. సైంధవ పాత్రధారికి స్థానభ్రంశం

By

Published : Sep 3, 2022, 10:42 AM IST

ఆ అధికారి.. సైంధవ పాత్రధారి శీర్షికతో ఈనాడు- ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. అటవీ అనుమతుల విషయంలో సైంధవ పాత్ర పోషిస్తున్న ఆ అధికారిపై అటవీశాఖ చర్యలు తీసుకుంది. ఆయనను కీలక విభాగం నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అధికారి
అధికారి

అటవీ అనుమతుల విషయంలో సైంధవ పాత్ర పోషిస్తున్న అధికారిపై వేటు పడింది. కీలక విభాగం నుంచి ఆయనను తప్పిస్తూ.. అటవీశాఖ ఆదేశాలు జారీచేసింది. ఆ అధికారి.. సైంధవ పాత్రధారి శీర్షికతో ఈనాడు- ఈటీవీ భారత్​లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు తక్షణం స్పందించారు. ఆ అధికారి తీరుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటవీ అనుమతుల కోసం వచ్చే దస్త్రాలను పరిశీలించే రూటింగ్‌ విధానాన్ని పీసీసీఎఫ్‌ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) ఆర్‌.ఎం.డోబ్రియాల్‌ సంస్కరించారు. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కీలక బాధ్యతల నుంచి సదరు అధికారిని తప్పించారు. ఆ స్థానంలో మరెవరినీ నియమించకుండా దస్త్రాల పరిశీలన ప్రక్రియలో డీసీఎఫ్‌ హోదానే తొలగించారు. కింది స్థాయి నుంచి వచ్చే ఫైళ్లు నేరుగా పీసీసీఎఫ్‌ (డెవలప్‌మెంట్‌) ఫర్గెయిన్‌కు, ఆ తర్వాత పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌కే వెళ్లేలా మార్పులు చేశారు. మరోవైపు.. రంగారెడ్డి జిల్లా కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌గా ఉన్న సునీత భగవత్‌ను ప్రధాన కార్యాలయం అరణ్యభవన్‌కు బదిలీ చేశారు. ఆమెకు అడ్మినిస్ట్రేషన్‌, ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగాల బాధ్యతలు (అదనపు పీసీసీఎఫ్‌గా) అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details